బాలికలకు సావిత్రి బాయి పూలే ఆదర్శం

Jan 3,2024 20:56

ప్రజాశక్తి – రామభద్రపురం : నేటి బాలికల విద్యాభివృద్ధికి సావిత్రి బాయి పూలే ఆదర్శమని రోటరీ క్లబ్‌ అధ్యక్షులు, నాయుడువలస పాఠశాల ఉపాద్యాయులు జెసి రాజు అన్నారు. బుధవారం పాఠశాలలో సావిత్రి బారు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఉపాద్యాయులు ,విద్యార్థులు ఆమె చిత్ర పటానికి పూల మాలవేసి నివా ళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నాగ భూషణం, ఉపాధ్యాయ సిబ్బంది రెడ్డి రవి, శివున్నా యుడు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.వేపాడ: వల్లంపూడిలో దళిత మహాసభ అధ్యక్షుడు కొమ్మనాపల్లి రాము ఆధ్వర్యంలో బుధవారం సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో చిన్నారులు చేసిన నృత్యాలు, వేశధారణ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపల్‌ రావాడ ఈశ్వరరావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.శృంగవరపుకోట: ఉపాధ్యాయ లోకానికి ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే అని ధర్మవరం జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ఉమామ హేశ్వరరావు అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివా ళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఉపాధ్యా యులు శివరామకృష్ణ, పాఠశాల సిబ్బంది కార్యదర్శి విఈ సత్యనారాయణ, ఉపాద్యాయులు బి. జయ, కే జయలక్ష్మి, డి శ్రావణి, కళ్యాణి, మూర్తి, రహీం షేక్‌ లాల్‌, ఈశ్వరరావు, ఐఎన్‌ ఎం మూర్తి, సతీష్‌ మాస్టర్‌, పేరినాయుడు, ఎల్‌వి సత్యనారాయణ, బి. నారాయ ణరావు తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి: పట్టణంలో ఇందిరమ్మ కాలనీ మున్సిపల్‌ పాఠశాలలో ఉన్న పూలే విగ్రహానికి ఎంఇఒ-2 వాసు నాయుడు, సామాజిక కార్యకర్తలు జగదీష్‌, రామ్మోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించి పేదల కు దుప్పట్లు పంపిణీ చేశారు. సంఘవీధిలో అంబేద్కర్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాలికల విద్యకు సావిత్రి భాయి పూలే పని చేసారని సొరు సాంబయ్య అన్నారు.

➡️