బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా

Feb 13,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మూడో వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ ఎఫ్‌టిఇ అధ్యక్ష ,కార్యదర్శులు జి.భాస్కరరావు,ఎన్‌.అప్పారావు మాట్లాడుతూ 2017 జనవరి 1 నుంచి మూడవ వేతన సవరణ అమలు చేయాలని, నూతన ప్రమోషన్‌ పాలసీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని కేడర్లలో ఏర్పడిన వేతన స్టాగేషన్‌ను తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.

➡️