బిజెపి ప్రభుత్వ ధమనకాండ నశించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌/జమ్మలమడుగు రూరల్‌ రైతాంగం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం రైతుల పట్ల కర్కషంగా వివరించిన విధానాన్ని నిరసిస్తూ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం పాత బస్టాండ్‌ పూలే సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ జి.చంద్ర, రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి, భాస్కర్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పారు. అందుకు నిరసనగా రెండో విడత ఢిల్లీ రైతాంగం శాంతియుతంగా ఢిల్లీకి పోతుంటే బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల కాల్పులు జరిపి, పోలీసులచే దాడి చేయించి రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ ను కేంద్ర ప్రభుత్వం బలితీసుకుందన్నారు. గత రైతు ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా రైతాంగానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని, ముఖ్యంగా రైతులు పండించే అన్ని పంటలకు డాక్టర్‌.ఎం .ఎస్‌ .స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పంటరుణాలను మాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020ను ఉపసహరించుకోవాలని చెప్పారు. గత రైతు ఉద్యమ సందర్భంగా మరణించిన అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని, రైతుఉద్యమంలో రైతునాయకులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని పేర్కొన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని చర్చలు జరిపి రైతాంగం ఆందోళనను విరమించే విధంగా కషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్‌ శివారెడ్డి, సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు వెంకట శివ, రామ్మోహన్‌, రైతు సంఘాల నాయకులు శేఖర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, సావంత్‌ సుధాకర్‌, సిఐటియు నగర అధ్యక్షులు చంద్ర రెడ్డి, విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాజేంద్ర, ఓబులేష్‌ పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి.. పంజాబ్‌ – హర్యానా సరిహద్దులో ఖనౌరి వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతన్నలపై కాల్పులు జరిపి శశిధరన్‌ అనే యువ రైతుని చంపిన మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి. మనోహర్‌ అన్నారు. గురువారం స్థానిక జమ్మలమడుగు పట్టణంలోని ఎన్‌జిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేవంలో ఆయన మాట్లాడుతూ పంజాబ్‌ హర్యానా సరిహద్దులలో ఖనౌరి వద్ద శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు దుర్మార్గమని తెలిపారు. అన్నం పెట్టే రైతన్నలను చంపడం చాలా ఘోరమని తెలిపారు. హర్యానా ప్రభు త్వం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేస్తే ఢిల్లీకి రాకుండా ముళ్లకంచెలు, దిమ్మెలు కట్టి, గుంతలు తవ్వి, అడ్డుకోవడం చా లా దారుణమని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబానికి సంతాపం తెలు పుతూ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యకర్తలు సిపిఎం పట్టణ కార్యదర్శి జి. ఎసుదాస్‌, విజరు, ఏ. వినరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️