బిటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Mar 1,2024 20:53

ప్రజాశక్తి – కురుపాం: కురుపాం నుంచి గుణుపూర్‌ వెళ్లే ప్రధాన బిటి రోడ్డు నుంచి మండలంలోని గుమ్మ పంచాయతీలో గల కొనగూడ గిరిజన గ్రామానికి రూ.కోటీ 20 లక్షలు ఉపాధి హామీ నిధులతో మంజూరైన 1.5 కిలోమీటర్ల మేరకు బిటి రోడ్డు పనులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి ప్రజలకు మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కావున ప్రజలు ఇవన్నీ గమనించి మరోసారి వైసిపి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి తమ గ్రామానికి బిటి రహదారి లేక అనేక ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యే చొరవ తీసుకొని రహదారి మంజూరు చేయించినందుకు గ్రామస్తులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ఎ.గోపాలరావు, ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిసార్‌, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, మండల కన్వీనర్‌ ఐ.గౌరీ శంకర్‌, ఐటిడిఎ ఇంజనీరింగ్‌ అధికారులు, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గరుగుబిల్లి: కోట్లాది రూపాయలు వ్యయంతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి అన్నారు. పార్వతీపురం శ్రీకాకుళం ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి జంక్షన్‌ నుంచి పిట్టలమెట్ట గ్రామం వరకు దాదాపు రూ.1.40కోట్లతో నిర్మాణం చేపట్టనున్న తారురోడ్డు నిర్మాణం పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు ఉరిటి రామారావు, ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీ నాయుడు శంకుస్థాపన చేశారు. ఆనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి సర్పంచ్‌ కలిశెట్టి ఇందుమతి, మాజీ ఎంపిపి ద్వారపురెడ్డి ధనుంజయరావు, వైసిపి నాయకులు అంబటి గౌరునా యుడు, మంత్రబుడ్డి బలరాము నాయుడు, మంత్రబుడ్డి పార్వతమ్మ, అశోక్‌ బ్రహ్మ, గుంట్రేడ్డి చంద్రశేఖ రరావు, ఎం శశి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️