బిట్రగుంట అభివృద్ధికి రూ.500 కోట్లు

Jan 13,2024 21:26
ఫొటో : ఫుట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న పసుపులేటి సుధాకర్‌

ఫొటో : ఫుట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న పసుపులేటి సుధాకర్‌
బిట్రగుంట అభివృద్ధికి రూ.500 కోట్లు
ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంట రైల్వే పరంగా అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని పిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌ అన్నారు. పిఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడలను శనివారం బిట్రగుంట రైల్వే ఇంగ్లీష్‌ మీడియం క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్‌ ఇంగ్లాండ్‌గా పిలుచుకునే బిట్రగుంట అభివృద్ధికి అవసరమైతే ఎన్ని కోట్ల రూపాయల నిధులనైనా ఖర్చు పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వందేభారత్‌ రెండో ప్రాజెక్ట్‌, అల్యూమినియం గూడ్స్‌ కోచ్‌, సోలార్‌ ప్రాజెక్టుల బిట్రగుంటలో ఏర్పాటు చేసేందుకు నివేదిక ఇచ్చామని తెలిపారు. బిట్రగుంటలో ఉన్న రైల్వే స్థలం 850 ఎకరాల్లో దాదాపు రూ.500కోట్లు ఖర్చు అవుతుందని, తెలపగా తన సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బిజెపిలో ఉండగా కేంద్రం దృష్టికి బిట్రగుంటకు సంబంధించిన లోకోషెడ్‌, ఇతర అంశాలను తీసుకెళ్లానని తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో ఏదోక ప్రాజెక్టు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, కావలి నియోజకవర్గంలో వేలాదిమందికి జీవనాధారం దొరుకుతుందన్నారు. తొలినుంచి తాను పుట్టిన నేల, తన సొంత ఊరికి ఏదోకటి చేయాలనే తపనతో ముందుకు వెళుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో పిఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు, రైల్వే ఐసిఎఫ్‌ అధికారి చెన్నరు ఐ,యు, శ్రీనివాసులు, ఐసిఎఫ్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ చెన్నరు కె,వి రమేష్‌, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️