బిసిల ఓట్లతో గెలిచి.. వారికే వెన్నుపోటు

ప్రజాశక్తి-వెలిగండ్ల బిసిల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి బిసిలను అభివృద్ధి చేయకుండా వెన్నుపోటు పొడిచారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం వెలిగండ్లలో టిడిపి ఆధ్వర్యంలో జయహౌ బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పేరుకు బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించని ప్రభుత్వం ఏదయినా ఉందంటే అది కేవలం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో బీసీలకు అనేక పనిముట్లను కల్పించి వారి ఉపాధికి తోడ్పడిన వ్యక్తి అని తెలిపారు. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చంద్రబాబునాయుడును అధికారంలోకి తెచ్చుకుంటే మహిళలకు చేయూతనివ్వడంతో పాటు రైతాంగానికి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తారని తెలిపారు. బాబు ష్యూరిటీతోనే రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని అన్నారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత ప్రజలు మరోసారి వైసీపీకి ఓటు వేసి తప్పు చేయకుండా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని అన్నారు. వెలిగండ్ల మండలంలో వైసిపితో విసుగుచెంది టిడిపిలోకి వలసలు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, బీసీలు పాల్గొన్నారు.

➡️