బిసిల సాధికారతే టిడిపి లక్ష్యం : ‘బత్యాల’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ బిసిల సాధికారతే టిడిపి లక్ష్యమని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు పేర్కొ న్నారు. బుధవారం బత్యాల భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగిన బిసి గర్జన సభ విజయ వంతమైందని అన్నారు. బిసిలకు 50 సంవత్సరాలకి పింఛన్‌ అమలు చేయడమే కాక, రూ.4 వేలు వరకు పింఛన్‌ పెంపుదల నిర్ణయం హర్షనీ యమన్నారు. బిసిలపై దాడులు, దౌర్జన్యాలు నుంచి రక్షణ కొరకు ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుక వస్తారన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధుల ద్వారా ఐదేళ్లలో ఒకటిన్నర లక్షలకోట్లు ఖర్చు చేసి ఆ నిధులు కేవలం బిసిలు మాత్రమే వినియోగించుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానిక సంస్థలలో గతంలో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు తిరిగి పునరుద్ధరించడం, చట్టసభలలో 33శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్రానికి తీర్మానం పంపడం, అన్ని సంస్థలు, నామినేటెడ్‌ పదవులలో 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం, తక్కువ జనాభాతో ఎన్నికలలో పోటీ చేయలేని వర్గాలకు కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ, లక్ష పెంపుతో పెళ్లి కానుక, చట్టబద్ధంగా కుల గణన, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం, విద్య పథకాలు అన్ని తిరిగి పునరుద్ధరణ చేయడం వంటి అద్భుతమైన పథకాలతో బిసి సమగ్రాభివద్ధికి టిడిపి కట్టుబడి చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటించారని అన్నారు. బిసి భవ నాలతో పాటు ఏడాదిలోపే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి చేసి బిసి సంక్షేమం, సమగ్రాభివద్ధికి, బిసిలకు అండగా ఉంటుందని తెలిపారు. రథయాత్రతో వైసిపి గుండెల్లో గుబులు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రారంభించిన రథయాత్రతో వైసిపి గుండెల్లో గుబులు మొదలైందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు, జనసేన సమన్వయకర్త అతికారి దినేష్‌ పేర్కొన్నారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయం నుంచి 25 వాహ నాలతో రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నానికి చెందిన కొట్టే ఉదరుభాస్కర్‌ సోద రులు తమ సొంత నిధులతో ఈ వాహనాలను ఏర్పాటు చేసి రాష్ట్రం నలు మూలలకు పంపి జనసేన సిద్ధాంతాలు, పవన్‌కల్యాణ్‌ ఆశయాలతో పాటు టిడిపి, జనసేన ఉమ్మడి లక్ష్యం, కార్యాచరణను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను, దౌర్జన్య కాండను ఎండగట్టేందుకు ఈ రథయాత్ర దోహదపడుతుందని తెలిపారు. ఉమ్మడి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడి రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు.

➡️