‘బీసీలను మోసం చేస్తున్న జగన్‌’

సత్తెనపల్లి రూరల్‌: బీసీలను జగన్మోహన్‌ రెడ్డి మోసం చేస్తున్నారని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లో జయహౌ బీసీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ .బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేక రక్షణ చట్టం కల్పించామని, బీసీలకు ప్రత్యేక ఉపకులాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని వివరించారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్‌ ఈ ప్రభుత్వం తగ్గించిందని దీంతో 16 వేల మంది బీసీలకు అవకాశం లేకుండా చేశారని చెప్పారు.

➡️