బూచేపల్లికి సన్మానం

ప్రజాశక్తి-దర్శి : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని వారి నివాస గృహంలో తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జడ్‌పిటిసి మారం వెంకటరెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ మెంబరు వలి, సర్పంచులు వలి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా రాజసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైవి. సుబ్బారెడ్డిని తాళ్లూరు జడ్‌పిటిసి మారం వెంకటరెడ్డి, బెల్లంకొండవారిపాలెం సర్పంచి పోశం సుమలత శ్రీకాంత్‌రెడ్డి, దర్శి మండల నాయకులు గంగిరెడ్డిపాలెం యలమందారెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️