భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి : టిడిపి

ప్రజాశక్తి-పీలేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ప్రజాగళం సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని పీలేరు టిడిపి నాయకులు విజ్ఞప్తి చేసుకున్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం చిలకలూరిపేట సమీపంలోని బొప్పాడిలో జరిగిన ప్రజాగళం సభ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నాతాధికారులపై తగిన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది జనం సభ వైపుకు తోసుకు వస్తుంటే నియంత్రించాల్సిన బాధ్యత కలిగిన పోలీసులు చోద్యం చూస్తూ నిలబడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సమావేశంలో టిడిపి మండల పార్టీ కన్వీనర్‌ వారణాసి శ్రీకాంత్‌రెడ్డి, మండల టిడిపి యువ నాయకులు పసుపులేటి లక్ష్మీకర, ప్రచార కార్యదర్శి పోలిశెట్టి సురేంద్ర, మాజీ జడ్‌పిటిసి డాక్టర్‌ మల్లెల రెడ్డి బాష, పురం రామ్మూర్తి, శ్రీనాథ్‌రెడ్డి, వసంతాల రాజా పాల్గొన్నారు.

➡️