భారీగా సిఐల బదిలీ!

Jan 22,2024 00:32

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు గుంటూరు రేంజి పరిధిలో పలువురు సిఐలను బదిలీ చేస్తూ ఐజి పాల్‌రాజ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి రూరల్‌లో ఉన్న కె.శ్రీనివాసరెడ్డిని బాపట్ల ఎస్‌బికి, బాపట్ల డిసిఆర్‌బిలో ఉన్న ఈ.మాలకొండయ్యను రేంజి విఆర్‌కు, విఆర్‌లో ఉన్న వి.విజయచంద్రను పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు, గుంటూరు నగరంపాలెం సిఐ కె.మల్లికార్జునను నర్సరావుపేట రూరల్‌కు, తాడేపల్లి సిఐ ఎ.మల్లికార్జునరావును రేపల్లెకు, పెదకూరపాడులో ఉన్న కె.వీరాస్వామిని పెదకాకానికి బదిలీ చేశారు. పెదకాకాని సిఐ బి.సురేష్‌బాబును రేంజి విఆర్‌కు బదిలీ అయ్యారు. విఆర్‌లో ఉన్న ఎ.సుధాకర్‌ను తెనాలి టూటౌన్‌కు, అక్కడున్న ఎస్‌.వెంకట్రావును విఆర్‌కు, గుంటూరు పోలీసు కంట్రోలు రూమ్‌లోఉన్న ఎ.వి.శివప్రసాద్‌ను విఆర్‌కు, బాపట్ల దిశ సిఐ వి.సూర్యనారాయణను ప్రకాశం జిల్లా సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైం విభాగానికి, బాపట్ల జిల్లా ఎస్‌సిఎస్‌టి విభాగంలోఉన్న పసుపులేటి రామకృష్ణను వేమూరుకు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న జి.వెంకట్రావును మంగళగిరి రూరల్‌ సర్కిల్‌కు, ఇక్కడున్న వి.భూషణంను విఆర్‌కు, విఆర్‌లో ఉన్న ఎం.మధుసూధనరావును తాడేపల్లికి బదిలీ చేశారు. వీరంతా తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️