భూముల లబ్ధిదారులకే పట్టాలివ్వాలి

Dec 4,2023 17:44
సర్పంచ్‌ పినపోతు కామేశ్వరరావు,

ప్రజాశక్తి – తాళ్లరేవు

ల్యాండ్‌ సీలింగ్‌ భూములకు సంబంధించిన లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూరి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు స్థానిక ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల క్రితం శాంతమూల, పటవల గ్రామాలకు చెందిన నిరుపేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఓసి సామాజికవర్గాలకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ భూములను సాగు చేసుకుని జీవనం సాగించేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక దఫాలుగా అధికారులకు వినతిపత్రాలను అందించామని తెలిపారు. అయితే తమకు న్యాయం జరగలేదన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకూ పన్నులు చెలిస్తున్నామని, అయితే తహశీల్దార్‌ మాత్రం తమ దగ్గర రికార్డులు లేవని భూములు ఇచ్చినప్పటినుండి పన్నులు చెల్లిస్తున్నామని, తహసిల్దార్‌ ను వారిని అడిగితే మా దగ్గర రికార్డు లేదని చెబుతున్నారన్నారు. అయితే ఈ భూముల లబ్ధిదారుల్లో కొంతమందికి గతంలో పనిచేసిన తహశీల్దార్లు పట్టాలు ఇచ్చారని ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కలెక్టర్‌ను కలిసి ఈ విషయంపై చర్చించి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటవల పంచాయితీ సర్పంచ్‌ పినపోతు కామేశ్వరరావు, వైసిపి నాయకులు కొప్పిశెట్టి వెంకట్‌, కాలా వెంకటరమణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️