భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలి

Dec 28,2023 22:54
ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య

ప్రజాశక్తి – నిడదవోలు

ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కుల చట్టం (యాక్ట్‌ 27/2023)ను రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది బయ్యే లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. నిడదవోలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో 12వ రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో ప్రతిపక్షాలతో విస్తృతమైన చర్చలు జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం వలన ప్రజలకు ఎంతో నష్టమని తెలిపారు. ఈ కార్యమ్రంలో ఎన్‌వివిఎస్‌.రామచంద్రరావు, ఎం.రవికుమార్‌, ఎస్‌ కాశి, ఎండి మెహబూబ్‌, ఎం.అర్జునుడు, సిహెచ్‌ విజరు కుమార్‌, పి.సురేష్‌, ఎ.సతీష్‌ పాల్గొన్నారు

➡️