‘భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి’

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం-27తో ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, తక్షణం రద్దు చేయాలని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రాయచోటి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది శ్రీనివాసులురెడ్డి, బార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పగడాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంతో పేదల భూములన్నీ కూడా భూస్వాముల చేతుల్లోనికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని మండిపడ్డారు. భూ హక్కుల చట్టం-27 అమలులోనికి వస్తే ఇప్పటివరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులన్నీ రద్దయిపోతాయని వాటి స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ ను రెవెన్యూ అధికారులు తయారు చేస్తారని దీనినే ఫైనల్‌ హక్కుగా ప్రభుత్వం నిర్ధారిస్తుందన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఎఒ బాలకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బార్‌ సెక్రెటరీ నాగమల్లు, ఆర్‌.ఆనంద్‌ కుమార్‌, రాజ్‌ కుమార్‌ రాజు, రాజకుమారి చంద్రిక, రెడ్డయ్య, హ్యూమన్‌ భాష, ఖాదర్బాషా, నాగముని, చిన్నయ్య, రామాంజనేయులు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

➡️