మంత్రి సురేష్‌కు సన్మానం

ప్రజాశక్తి-కొండపి : కొండపి నియోజకవర్గంలోని దూదేకులకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డేనని నియోజకవర్గ దూదేకులు తెలిపారు. దూదేకుల సంఘం రాష్ట్ర అద్యక్షడు ఎస్‌ఎస్‌.బాజి ,జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు చినకండ్లగుంట సర్పంచి వన్నూరు సాహెబ్‌ ఆదేశాల మేరకు నియోజక పరిధిలోని దూదేకులు మంగళవారం మంత్రి సురేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షాదీ తోఫా పథకాన్ని లక్ష రూపాయలు పెంచిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపిన జగన్మోహన్‌రెడ్డి అండగా ఉంటామని ఈ సందర్భంగామంత్రి సురేష్‌కు హామీ ఇచ్చారు. దూదేకుల గామాల్లో సమస్యలను పరిష్కారించాలని కోరారు. ప్రధానంగా ఖబరస్తాన్‌ సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు మట్టిపాటి బాషా, పలువురు దూదేకులు పాల్గొన్నారు.

➡️