మనుషుల్లో మానవతా దృక్పథం నెలకొల్పాలి

ధార్మిక విజ్ఞాన పరిణామం: ప్రాచీన సంప్రదాయాలపై ఆధునిక దృక్పథాలు

ఎయులో థార్మిక విజ్ఞాన పరిణామంపై జాతీయ సదస్సులో ఆచార్య రెమిరజని

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : మానవ సమాజంలో మత విశ్వాసాలకంటే మానవతా దృక్ఫధం నెలకొల్పాలిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీకాకుళం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కాళంగి రెమిరజిని అన్నారు. బుధవారం ఎయులో ఫిలాసఫీ అండ్‌ రెలీజియస్‌ స్టడీస్‌ విభాగం, ఎసిటిఎస్‌ సంయుక్త నిర్వహణలో ”ధార్మిక విజ్ఞాన పరిణామం: ప్రాచీన సంప్రదాయాలపై ఆధునిక దృక్పథాలు’ అంశంపై జాతీయసదస్సు నిర్వహించారు ఫిలాసఫీ శాఖాధిపతి ఆచార్య వానపల్లి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆచార్య రెమిరజని మాట్లాడుతూ, మనిషి మనిషి మధ్య మతం అడ్డుగోడగా ఉందన్నారు. ప్రవర్తనను సరైన మార్గంలోకి నడిపించాల్సిన మతసారాన్ని తెలుసుకోకుండా, మనిషి స్వార్ధంతో మతఘర్షణలకు పాల్పడుతూ సమాజాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని, దీనిని అందరూ ముక్తి కంఠంతో ఖండించాలన్నారు. .ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించే సంప్రదాయాలు అంతరించి పోతున్నాయని ఆవేదన చెందారు. బెంగుళూర్‌ ఏసిటియస్‌ అకాడమీ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ సిఇఒ సంతోష్‌ నకణ్‌ మాట్లాడుతూ, ఎయుతో ఎసిటిఎస్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందని, దీని ద్వారా విద్యార్ధులలో పరిశోధనా సామర్ధ్యం పెంపొందుతుందన్నారు.ఎయు రిజిస్ట్రార్‌ ఆచార్య యం జేమ్స్‌ స్టీఫెన్‌ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు విస్తృతమై, ప్రపంచమే కుగ్రామంగా మారిన నేటి పరిస్థితుల్లో మానవతా విలువలు లోపించడం బాధాకరమన్నారు. ధార్మిక జీవన విధానం తో మనుస్యుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తొలగించుకునే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో బోర్డు అఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ డాక్టర్‌ బూసి వెంకటస్వామి, ఉత్కల్‌ యూనివర్సిటీ ఆచార్య నందిని మిశ్రా, విక్రమ్‌ దేవ్‌ యూనివర్సిటీ జైపూర్‌ ఆచార్య లక్ష్మణ్‌ పాత్రో, రమాదేవి, కటక్‌ మహిళా యూనివర్సిటీ నుంచి కళ్యాణి సారంగీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఆచార్య పి రామకృష్ణ చౌదరి, విజయనగరం మహారాజ కళాశాల తత్త్వశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ జి మాధవరావు ,చరిత్ర విభాగాధిపతి జె వి రమణ, డాక్టర్‌ ముసుగు ప్రసాద్‌, డాక్టర్‌ ద్రాక్షాయణి, డాక్టర్‌ కల్యాణి, రాజధమ్మా పాల్గొన్నారు

మాట్లాడుతున్న శ్రీకాకుళం అంబేద్కర్‌ వర్సిటీ విసి రెమిరజని

➡️