మరొక్క అవకాశం ఇవ్వండి : కోలగట్ల

Jan 11,2024 21:19

 ప్రజాశక్తి- విజయనగరం :  సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎవ్వరికి ఏ సమస్య వచ్చి తలుపు తట్టినా నేనున్నానని ధైర్యం చెప్పే తనకు వచ్చే ఎన్నికల్లో మరొక అవకాశం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలను కోరారు. గురువారం సారిపల్లి లో 352 కుటుంబాలకు టిడ్కో గృహాల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎల్‌ఎ గా మరొక్క అవకాశం ఇస్తే సమస్యలు లేని విజయనగరాన్ని చూపిస్తానని, వచ్చేసారి యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. సమావేశంలో సహాయ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద రావు, టిడ్కో ఇఇ అరుణ, మేయర్‌ విజయలక్ష్మి, వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు, హౌసింగ్‌ కమిటీ సభ్యులు ఎస్‌వి రాజేష్‌, తవిటి రాజు, మారోజు శ్రీనివాసరావు, గాదం మురళి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. సామాజిక భవనం ప్రారంభం నగరంలోని ఒకటో డివిజన్‌ సాకేటి వీధిలో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. రూ.14 లక్షలతో నిర్మించిన సామాజిక భవనం స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అనంతరం మీడియాతో వైసిపి పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడమధు, జోనల్‌ ఇన్‌ఛార్జి మచ్చు శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి సిఎం కట్టుబడ్డారని అన్నారు. ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌, కోఆప్షన్‌ సభ్యులు ముద్దాడ రమణి, వైసిపి నాయకులు, కార్యకర్తలు , స్థానికులు పాల్గొన్నారు.

➡️