మహిళలు అన్నిరంగాల్లో ముందంజ

ప్రజాశక్తి – కడప అర్బన్‌/కడప మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారని బాలికల కళాశాల అధ్యాపకురాలు నీలవేణి అన్నారు. శుక్రవారం ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుస్కరించుకుని కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు సాధ్యమం కాని రంగం ఏదిలేదని పేర్కొన్నారు. గొప్పవారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎపిజిఇఎ ఆఫీస్‌ బేరర్స్‌ రామరంజిత, వెంకట సుబ్బమ్మ, రేణుక, మరియకుమారి, సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్‌కుమార్‌, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘు రామనాయుడు, నగర అధ్యక్షులు కృష్ణప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు ప్రసాద్‌గౌడ్‌, మార్క్‌, రామాంజనేయులురెడ్డి, అమృతరామయ్య, వి.వి.చంద్రశేఖర్‌, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కెఒఆర్‌ఎంలో.. నగరంలోని కెఒఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి టిడిపి కడప నియోజక వర్గ అభ్యర్థి మాధవిరెడ్డి, కళాశాల కరస్పాండెంట్‌ లిఖితరెడ్డి, కందుల గ్రూప్‌ ఆఫ్‌ ఇన్స్‌ట్యూట్‌ కరస్పాండెంట్‌ కందుల రాజేశ్వరమ్మ హాజరయ్యారు. మాధవిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ లావణ్య, ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ హరిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామలమ్మ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి వివిధ సేవలు అందించిన వికలాంగ మహిళ టి. ప్రేమలతను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళా నగర అధ్యక్షురాలు వేముల నాగరత్నగౌడ్‌, వి రమాదేవి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి, పైడికల్వ నాగరాణి, జిల్లా కార్యదర్శి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. ఎపిపిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మల్లెం విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో.. నగరంలోని ఆర్‌కె నగర్‌ షాలేం ప్రార్థన మందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాలేం ప్రార్థన మందిరం అధ్యక్షురాలు సిస్టర్‌ రాజకుమారిని, అలాగే సిస్టర్‌ కే ప్రనూషను సన్మానించారు. కార్యక్రమంలో కె ప్రనూష, ఎం ప్రభావతి, బి శారద, సునీత, సుజాత, జ్యోతి పాల్గొన్నారు.చింతకొమ్మదిన్నె : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎయిల్‌ డిక్సన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నరేష్‌ చావా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిల్‌ డిక్సన్‌ కంపెనీ వారు మహిళలకు డ్రాయింగ్‌ అండ్‌ డాన్సీ ర్యాంప్‌, సింగింగ్‌ పోటీలు నిర్వహించారు. అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నరేష్‌ చావా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుసున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. ఊటుకూరులో.. నెహ్రూ యువ కేంద్రం కడప శాఖ, సన్‌స్టైనబుల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సీకర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో చింతకొమ్మదిన్నె పరిధిలోని ఊటుకూరులో పొదుపు సంఘాల మహిళలతో కలిసి మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిసిడిఎస్‌ చైర్మన్‌ యాగప్ప, ఆర్‌పి నీలం రామలక్ష్మి, ఆశా వర్కర్‌ లక్ష్మీదేవి ఆర్గనైజేషన్‌ ఫర్‌ సీకర్స్‌ చైర్మన్‌ నరసింహ ప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ప్రొద్దుటూరు తాలూక అధ్యక్షులు రఘురామిరెడ్డి సహకారంతో మహిళావిభాగం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్బంగా రఘురామిరెడ్డి మహిళాదినోత్సవ ఆవిర్భావం, విశిష్టత వివరించారు. కార్యక్రమంలో మెడికల్‌ఆఫీసర్‌ డాక్టర్‌ ఇలియారాణి, సావిత్రమ్మ, వుమెన్‌వింగ్‌ కన్వీనర్‌ సుజాత కో-చైర్మన్‌ ప్రమీలాదేవి మహిళా నాయకులు, ఎన్‌జిఒ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం పలువురికి సన్మానాలు చేశారు.

➡️