మాగుంట రాఘవరెడ్డికి సత్కారం

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఒంగోలు పార్లమెట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టిడిపి నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాతశింగరాయకొండకు చెందిన టిడిపి ఉపాధ్యక్షుడు కొట్టే జాలయ్య, బాపట్ల శివకుమార్‌, షేక్‌ అబ్దుల్‌ అజీమ్‌, మసనం నరేష్‌, పిగిలి శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

➡️