మానవతకు ప్రతిరూపం వివేకా

ప్రజాశక్తి – కడప జిల్లాలోని -16 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ నోటిఫికేషన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంయుక్త కలెక్టరు జి. గణేష్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ స్పందన హాల్‌లో గ్రూప్‌ -1 స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహణపై సంయుక్త కలెక్టర్‌, ఎపిపిఎస్‌సి పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులు, పర్యవేక్షకులు సయాద్‌ నాగూర్‌ షరీఫ్‌, యం. రామంజి లతో కలిసి పరీక్షల విధులు కేటాయించిన 18 మంది లైజెన్‌ ఆఫీసర్లు, 16 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ నెల 17న ఉదయం పది గంటల నుంచి మధ్యహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు ఉదయం 09.00 గంటల నుండి 09.45 గంటల వరకు , మధ్యాహ్నం 01.00 గంట నుండి 01.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైజెన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపర్‌వైజర్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతి సెంటర్లో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి కొరత లేకుండా ఆయా పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు అన్ని వసతులను ఏర్పాటు చేయా లన్నారు. జిల్లాలోని కడప నగర పరిధిలో 07, చెన్నూరు మండల పరిధిలో 01, చింతకొమ్మదిన్నె మండల పరిధిలో 04, చాపాడు మండల పరిధిలో 01, ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో 03 పరీక్షా కేంద్రంతో కలిపి మొత్తం 16 కేంద్రాల్లో పరీక్ష ఉంటు ందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాల అధికారి విజరు కుమార్‌, ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ సెక్షన్‌ ఆఫీసర్లు, లైజెన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరిం టెండెంట్లు, లైన్‌ డిపార్టుమెంట్ల సంబంధితాధికారులు పాల్గొన్నారు.

➡️