మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం బర్రింకలపాడు గురుకుల పాఠశాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్‌-17 జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. పలు రకాల క్రీడా పోటీలకు జోన్‌-2 పరిధిలోని 17 గిరిజన గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారుల వరకు పాల్గొన్నారని ప్రిన్సిపల్‌ బి.పెద్దిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థి మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని అన్నారు. గిరిజన గురుకులాల్లో చదువుతో పాటు ఆటలకు మంచి ప్రాధాన్యత వుంటుందన్నారు. ఆటల పోటీల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావంతో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కోర్స పోసమ్మ, జెడ్‌పిటిసి వసంతరావు, వైస్‌ ఎంపిపి ఎస్‌.శ్రీనివాస్‌, ఎంపిటిసి సున్నం సురేష్‌, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాస్‌, ఎంపిడిఒ కృష్ణప్రసాద్‌, గురుకుల ప్రిన్సిపల్‌ బుడితి పెద్దిరాజు, వైస్‌ ప్రిన్సిపల్‌ రమేష్‌, పీడీలు, నాయకులు కుంజ రాముడు, ఉప్పల రాంపండు పాల్గొన్నారు.

➡️