‘మార్చి 8’ స్ఫూర్తిని స్వీకరించాలని పిలుపు

Mar 5,2024 21:59
ఫొటో : మాట్లాడుతున్న స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు ఎల్‌ శ్యామల

ఫొటో : మాట్లాడుతున్న స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు ఎల్‌ శ్యామల
‘మార్చి 8′ స్ఫూర్తిని స్వీకరించాలని పిలుపు
ప్రజాశక్తి-కావలి : అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8’ స్ఫూర్తిని స్వీకరిద్దామనిస్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు ఎల్‌ శ్యామల పిలుపునిచ్చారు. కావలి జెడ్‌పి గర్ల్స్‌ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘మార్చి 8’ సందర్భంగా మంగళవారం స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. సభకు హెచ్‌ఎం ఎ వి ఎం శేషమ్మ అధ్యక్షత వహించారు. వక్తగా లాయర్‌ సాయిప్రసాద్‌ మాజీ బార్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడారు. మరొక వ్యక్తగా దంత వైద్యులు డాక్టర్‌ దినకరన్‌ మాట్లాడారు. ఇంకా లక్ష్మీరెడ్డి, ఎఐఎఫ్‌టియు (న్యూ) జిల్లా నాయకులు మరియు మహిళా టీచర్లు పాల్గొన్నారు. స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు ఎల్‌ శ్యామల మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘మార్చి 8’ నేపథ్యం వివరించారు. మహిళలపై, బాలికలపై దాడులను, హింసను ప్రేరేపిస్తున్న సినిమాలు, టివి, సెల్‌ ఫోన్‌లలో వచ్చే విష సంస్కృతికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రంగాలలో తీవ్రమవుతున్న సంక్షోభం నేపథ్యంలో మహిళల జీవనం మరింత కష్టాల మయమవుతుందన్నారు. పేదరికం, ఉపాధి లేమి వంటి సమస్యలతో పాటు పితృ స్వామిక అణచివేత, పెరుగుతున్న సాంస్కృతిక విధ్వంసం మహిళలకు, బాలికలకు ఎక్కడా రక్షణ లేకుండా చేస్తుందన్నారు.

➡️