మిమ్స్‌ ఉద్యోగులకు అండగా ఉంటాం

Feb 11,2024 21:18

  ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి లోకం మాధవి తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌ఒబి వద్ద సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ మిమ్స్‌ ఉద్యోగులు డిఎలు, వేతన ఒప్పందం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మిమ్స్‌ ఉద్యోగులకు రూ.లక్ష విరాళం అందజేశారు. మద్దతు తెలిపిన వారిలో జనసేన నాయకులు రవ్వా నాని, మద్దిల అప్పన్న, తదితరులు ఉన్నారు. ఈ శిబిరంలో మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటియు నాయకులు కె.రామారావు, ఉద్యోగులు వి.అప్పలనాయుడు, మూర్తి, రాంబాబు, మధు, గౌరి, వరలక్ష్మి, భవానీ, నాగేశ్వరరావు, కాము నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️