మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి వెల్లువెత్తిన మద్దతు

Mar 5,2024 21:33

ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతిస్తామని వైసిపి, టిడిపి, జనసేన, సిపిఎం, సి పి ఐ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు,కార్మికులు చేస్తున్న పోరాటం మంగళ వారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సంఘీభావ సభ శిబిరం వద్ద జరిగింది. అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు హాజరై మాట్లాడారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, డిసిసిబి వైస్‌ చైర్మన్‌ చనుమల్ల వెంకటరమణ, నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, వైసిపి పట్టణ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌, పూసపాటిరేగ ఎఎంసి చైర్‌పర్సన్‌ చిక్కాల అరుణకుమారి, చిక్కాల సంతోష్‌ చిక్కాల సుమతి , టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, తుమ్మల పేట పిఎసిఎస్‌ అధ్యక్షులు కోట్ల పైడి నాయుడు, కౌన్సిలర్లు అవనాపు సత్య నారాయణ, మజ్జి అన్నపూర్ణ, నరవ రామలక్ష్మి, మైపాడ ప్రసాద్‌, బూర సుజాత, కింతాడ కళా వతి, నాయకులునల్లి చంద్రశేఖర్‌, నాయకులు లెంక అప్పలనాయుడు, రాజి నాయుడు, సత్యనారాయణ, జనసేన నాయకులు నాని, శ్యామల రావు, సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు, సిపిఐ నాయకులు మొయిధ పాపారావు, అడ్వకేట్‌ కె.సన్యాసిరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం, సిఐటియు నాయకులు బి.సుధారాణి, సురేష్‌, పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యంగా సంఘం అనేది ఉద్యోగుల హక్కు అని, దాన్ని వద్దంటూ మిమ్స్‌ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదరి అన్నారు. యాజమాన్యం వెంటనే సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు నిర్వహించే పోరాటాలకు తాము కూడా మద్దతు ఇచ్చి వారి వెంటే ఉంటామని ప్రకటించారు.

పోరాటం ఉధృతం

మిమ్స్‌ యాజమాన్యం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ హెచ్చరించారు. నిరసన శిబిరం నుంచి డైట్‌ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరి వీడి ఉద్యోగులు, కార్మికులు కు జనవరి నెల జీతాలు చెల్లించి, 7 డిఎల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలా కాని పక్షంలో పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉదతం చేస్తామని తెలిపారు. జనవరి నెల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వారికి ప్రభుత్వం అధికారులు వత్తాసు పలకడం సమంజసం కాదని అన్నారు. మిమ్స్‌ ఉద్యోగులకు, కార్మికులకు ప్రజాసంఘాలు, సిఐటియు కార్మికులు అండగా నిలిచి యాజమాన్యం దిగి వచ్చే వరకు వారి పక్షాన పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. నిరసన శిబిరానికి నగర పంచాయతీ 7వవార్డు కౌన్సిలర్‌ మైపాడ ప్రసాద్‌ 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

➡️