మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Feb 16,2024 21:45

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు 15 రోజులుగా చేస్తున్న నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం ఉద్యోగులు, కార్మికులకు డిఎ బకాయిలు, వేతనఒప్పందం చేయకుండా అడిగిన వారిని సస్పెండ్‌ చేయడం తగదన్నారు. ఇరువర్గాలు చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మిమ్స్‌ యాజమాన్యంపై ఉందన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఆయన రూ.10వేల రూపాయలు పోరాట నిధి అందజేశారు. కార్యక్రమం లో వైసిపి నాయకులు సారిపల్లి గుర్నాధరావు, మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, ఉద్యోగులు ఎం.నారాయణ, కె. కాము నాయుడు, ఎం. నాగ భూషణం, మూర్తి, రాంబాబు, మధు, గౌరి, వర లక్ష్మీ, రామ కష్ణ, బంగారునాయుడు పాల్గొన్నారు.

➡️