ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’

Jan 27,2024 20:36

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఈ నెల 24 నుంచి జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర నియోజక వర్గ స్థాయి క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు నగర పంచాయతీ పరిది థామస్‌ పేట ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో విజేతలకు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజినీ, మండల ప్రత్యేకాధికారి వి.శ్రీనివాస్‌, కమిషనర్‌ పి. బాలాజీ ప్రసాద్‌, ఎంపిడిఒ జి.రామారావు చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో పురుషుల కబడ్డీ విజేతల నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటి రేగ జట్టులు వరుస స్థానాల్లో నిలిచాయి. స్త్రీలు కబడ్డీ విజేతలుగా నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటి రేగ జట్టులు వరుస స్థానాల్లో నిలిచాయి. పురుషులు ఖో-ఖో విజేతలుగా పూసపాటి రేగ, భోగాపురం, నెల్లిమర్ల, స్త్రీలు ఖో-ఖో విజేతలుగా నెల్లిమర్ల, పూసపాటి రేగ, భోగాపురం జట్టు విజయం సాధించాయి. పురుషులు బ్యాడ్మెంటన్‌ విజేతలుగా నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, స్త్రీలు బ్యాడ్మెంటన్‌ విజేతలు డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం, పురుషులు వాలీబాల్‌ విజేతలుగా భోగాపురం, పూసపాటి రేగ, నెల్లిమర్ల, స్త్రీలు వాలీబాల్‌ విజేతలు భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, పురుషులు క్రికెట్‌ విజేతలు పూసపాటి రేగ, భోగాపురం, డెంకాడ జట్లు వరుస స్థానాల్లో విజయం సాధించాయి. నియోజకవర్గ స్థాయిలో విజేతలకు కబడ్డీ, క్రికెట్‌, వాలీబాల్‌, ఖో-ఖో క్రీడలకు ప్రథమ బహుమతిగా జట్టుకు రూ. 35వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15వేలు తృతీయ బహుమతిగా 5వేలు అందించారు. బాడ్మెంటన్‌కి రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ ఈపు విజరు కుమార్‌, యుఎస్‌ఎన్‌ మూర్తి, ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, నెల్లిమర్ల నియోజక వర్గస్ధాయిలో పీడీలు, పిఇటిలు నగర పంచాయతీ సిబ్బంది, మండల పరిషత్‌ సిబ్బంది, వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.హోరాహోరీగా పోటీలుశృంగవరపుకోట: ఆఫీసర్స్‌ క్లబ్‌లో శనివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్‌ పోటీలను ఎస్‌కోట ఎంపిడిఒ శేషుబాబు, ఎంఇఒ బి. నర్సింగ్‌రావులు శనివారం ప్రారంభించారు. ఐదు మండలాల మధ్య పోటీలు హోరా హోరీగా సాగాయి. చివరకు బ్యాడ్మింటన్‌లో ఎస్‌ కోట ప్రథమ స్థానంలోనూ, వేపాడ ద్వితీయ స్థానం, ఎల్‌.కోట తృతీయ స్థానం సాధించాయని మండల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. డాక్టర్‌ వరలక్ష్మి సీబీఎస్సీ పాఠశాల క్రీడామైదానంలో మహిళల కబడ్డీ, కోకో, వాలీబాల్‌ పోటీలు నియోజకవర్గ క్రీడా కోఆర్డినేటర్‌ కె. కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో వాలీబాల్‌ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొత్తవలస, ఎస్‌.కోటలు నిలిచాయి. కోకో విభాగంలో కొత్తవలస, ఎస్‌ కోట ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయని, కబడ్డి ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలసలు వరుస స్థానాల్లో నిలిచాయని శ్రీరాములు తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం పురుషుల క్రికెట్‌ పోటీలు ఉదయం9 గంటలకు గవర్నమెంట్‌ బాలుర ఉన్నత పాఠశాల ఎస్‌కోట క్రీడా మైదానంలో ప్రారంభమవుతాయని, పురుషుల కబడ్డీ సెమీఫైనల్స్‌ ఫైనల్స్‌ ఆదివారం ఉదయం డాక్టర్‌ వరలక్ష్మి సీబీఎస్సీ పాఠశాలలో జరుగుతాయని శ్రీరాములు తెలిపారు.

➡️