ముగ్గుల పోటీలు

Jan 13,2024 21:28
ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం

ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం
ముగ్గుల పోటీలు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:జనసేన పార్టీ సిటీ నిర్దేశకులు వేములపాటి అజరు కుమార్‌ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో విఆర్‌సి గ్రౌండ్‌లో మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో భాగంగా శనివారం వీర మహిళలు ముగ్గుల పోటీ నిర్వహించి, ప్రథమ, ద్వితీయ,తతీయ బహుమతులను ప్రదానం చేయడమే గాక పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్‌ బహుమతులు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సాంప్రదాయాలను, సంస్కతులను కాపాడడం అనేది జనసేన పార్టీ ముఖ్యమైన ఏడు సిద్ధాంతాల్లో ఒకటి.సంక్రాంతి పండుగంటేనే శతకోటి వేడుకలు వాటిని స్ఫురింప చేస్తూ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.నెల్లూరు సిటీ నిర్దేశికులు వేములపాట అజరు సూచనలతో ముగ్గుల పోటీ నిర్వహించిన వీర మహిళలకు అభినందనలు తెలిపారు.పనికిమాలిన పీడలను పనికిరాని పార్టీలను, నాయకులను భోగి లో తోసి కొత్త శోభతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ కొత్త నాయకులను ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛందంగా ముగ్గుల పోటీకు కలిసి వచ్చిన మహిళలకు చాలా చక్కగా దీన్ని నిర్వహించిన వీర మహిళలకు పేరుపేరునా కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రథమ బహుమతి మిక్సీ, ద్వితీయ బహుమతి గ్యాస్‌ స్టవ్‌, తతీయ బహుమతులు కుక్కర్‌ ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్‌ సతీమణి గునుకుల విజయలక్ష్మి, జనసేన వీర మహిళలు నగరం హైమావతి, కష్ణవేణి, హసీనా, ప్రవల్లిక, సుజా, సుభాషిణి, జనసేన సీనియర్‌ నాయకులు ఏటూరు రవికుమార్‌, కష్ణారెడ్డి, హరి రెడ్డి, ఈగి సురేష్‌, కాకు మురళి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️