మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మండపేటలో మున్సిపల్‌ కాంట్రాక్‌ కార్మికుల సమ్మెకు మద్దతుతెలుపుతున్న కె.కృష్ణవేణి, ఎంఎల్‌ఎ వేగుళ్ల తదితరులు

ప్రజాశక్తి-మండపేట

మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు నూకల బలరాం, కె.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేసిన నిరశన శిబిరాన్ని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు జనసేన నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలుు ఇవ్వాలని, సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బంగారు కొండ కొమారపు నరేంద్ర కుమార్‌, లోవరాజు, విజరు తదితరులు పాల్గొన్నారు.

 

➡️