మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

Jan 9,2024 00:10
మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి – యంత్రాంగం

మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14వ రోజుకు చేరింది. జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రాంతాల్లో కార్మికులు తమ అందోళనను కొనసాగించారు. ఆయా మున్సిపల్‌ కార్యాలయాలను కార్మికులు ముట్టడించారు. పిఠాపురం గొల్లప్రోలు మండలంలోని నగర పంచాయితీ కార్యాలయాన్ని పారిశుధ్య కార్మికులు సోమవారం ముట ్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నందీ శ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు యేసమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల పట్ల మొండివైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు, 6 నెలల బకాయి జీతాలను తక్షణమే విడుదల చేయాలని, అప్పటి వరకూ సమ్మెను విరమించేది లేదని హెచ్చరించారు. ఇదే అంశంపై కమిషనర్‌ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, స్థానికంగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్య క్రమంలో కార్మికులు లోవబాబు, బి.సత్యవతి, సిహెచ్‌. రామారావు, జి రాజులు, రాజమోహన్‌, రాములమ్మ, లక్ష్మి, పార్వతి, పైడిరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్ట డించారు. మున్సిపల్‌ సెం టర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయ కులు మున్సిపల్‌ కార్మికులకు మద్దతు తెలిపారు. టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంది సత్యనారా యణ తూతిక రాజు, జన సేన నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ తుమ్మల రామస్వామి, పట్టణ అధ్యక్షులు పొలమర శెట్టి సత్తి బాబు, పిట్టా జానకి రామయ్య, సిపిఎం నాయకులు కరణం ప్రసాదరావు, నీలపాల సూరిబాబు లు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, చింతల సత్యనారాయణ, తైనాల శ్రీను, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గిరిబాబు శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, ద్రౌపతి శ్రీను, వేలాపు శివభవాని, ముత్యాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఎదురుగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల కొనసాగాయి. నిరాహార దీక్షలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. సిపిఐ సీనియర్‌ నాయకులు ఎలిశెట్టి రామదాసు పాల్గొని మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు బొచ్చ శీను, కసింకోట ఆనందరావు, కసింకోట కిషోర్‌, కౌలు వరమ్మ, సింగంపల్లి పద్మ, బంగారు కొండమ్మ, చెన్నా నాగ మనీ ,బంగారు లావణ్య, సత్తిబాబు, ఆజారి లావరాజు, వెంకటేశు, ఎన్వి నాగేంద్ర, మిర్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️