మైనార్టీలు హక్కులను కాపాడుకోవాలి

ప్రజాశక్తి – కడప మైనార్టీలు తమ హక్కులను కాపాడుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా సోమవారం కడప నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దేశంలోని మైనారిటీ వర్గాల హక్కులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరమూ డిసెంబర్‌ 18న మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. ప్రస్తుత మైనారిటీల శాతం దేశంలోని మొత్తం జనాభాలో 19.3 శాతం ఉందన్నారు. స్వేచ్ఛ సమాన అవ కాశాలను మైనారిటీలకు అందించాలని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు లను ఈ సందర్భంగా జడ్జి వివరించారు. కార్యక్రమంలో శాంత, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌, పి.మనోహర్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌, హెడ్మాస్టర్‌, కె.పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️