మోగిన నగరా

Mar 16,2024 22:14 #మోగిన నగరా

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ శని వారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. 2024 ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల, మే 13న పోలింగ్‌, జూన్‌ నాలుగున కౌంటింగ్‌ నిర్వహిం చనున్నట్లు ప్రకటించింది. జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలుకుని సమర్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్‌ షె డ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి వచ్చి ంది. కడప జిల్లాలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, అసె ంబ్లీ నియోజకవర్గాలు, కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ పార్టీలైన అధికార వైసిపి జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు టికెట్లు ప్రకటించింది. ప్రతిపక్ష టిడిపి సైతం పొత్తు ధర్మంలో భాగంగా ఒకటి, రెండు అసెంబ్లీలు పార్లమెంట్‌ స్థానాలు మినహా మిగిలిన అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఆర్నెళ్లుగా ఆశావహుల ప్రచారం జిల్లాలో ఆర్నెళ్లుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో అధికార, ప్రతిపక్ష, ఎన్నికల బరిలో నిలిచే ఇతర పార్టీల అభ్యర్థులు ఆర్థిక, అంగ బలాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కత్తులు దూస్తూ ముందు కెళ్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మధ్య పరస్పర విమర్శల వర్షం కురుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసంతృప్తులను బుజ్జ గింపులు ప్రక్రియ ఊపం దు కుంది. రాబోయే రోజుల్లో మరింత ఊపందుకోనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల వ్యూహ, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలను వ్యూహాత్మకంగా అమలు చేయడంపై దృష్టి సారించారు. హోరాహారీ…షురూ జిల్లాలో హోరాహోరీ పోరుకు తెరలేచింది. అధికార వైసిపి కడప జిల్లాలో సిట్టింగులనే బరిలో నిలిపింది. అన్నమయ్య జిల్లాలో రాజంపేట మి నహా పాతకాపులకే అవకాశం కల్పించింది. ఎన్నికల సమరాం గణంలోఅనుభవజ్ఞులనే దింపింది. ప్రతిపక్ష టిడిపి మైనార్టీ స్థానమైన కడపలో మాధవిని బరిలో నిలిపి అదృష్టాన్ని పరీక్షిస్తోంది. జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపి తరుపున బరిలో నిలవనున్న నేపథ్యంలో ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి టికెట్‌ లభించడంతో హోరాహోరీ పోటీ నెలకొంది. కమ లాపురం, మైదుకూరు అసెంబ్లీ స్థానాల్లో సీనియర్లు, యువతకు అవకాశం ఇవ్వడంతో నువ్వానేనా అనే వాతావరణం నెలకొంది. రాజంపేట టికెట్‌ టిడిపి అభ్యర్థికి ఇస్తే హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాల్లో ఉత్కంఠభరిత పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కడప పార్లమెంట్‌ బరిలో వైఎస్‌.అవినాష్‌రెడ్డికి పోటీగా మాజీమంత్రి కీ.శే వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్న నేపథ్యం ఉత్కంఠను కలిగిస్తోంది.

➡️