యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలి: సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా తెలిపారు. శనివారం పెద్దదోర్నాలలోని బొగ్గరపు వారి కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో శివరాత్రి పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగకు శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తుల రద్దీ అధికం గా ఉంటుందని అన్నారు. అయితే భక్తులకు మరుగుదొడ్లు, మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్‌ తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. పారిశుధ్యం లోపిస్తే వ్యాధులు ప్రబలుతాయని అన్నా రు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చిత్తూరి హారిక, తహశీల్దారు హమీద్‌, ఎంపిడివో నాసర్‌రెడ్డి, సిఐ రాములు నాయక్‌, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవరావు, ఐటిడిఏ డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఎం శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భాస్కర్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్వో విశ్వేశ్వరరావు, విద్యు త్‌ ఏఈ నాగేంద్రరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️