యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

Mar 6,2024 22:11
ఫొటో : విజేత జట్టుకు కప్‌ అందిస్తున్న పిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌

ఫొటో : విజేత జట్టుకు కప్‌ అందిస్తున్న పిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంట గ్రామంలో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం అని పిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌ పేర్కొన్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయిస్‌ సంగ్‌ వారి ఆధ్వర్యంలో బిట్రగుంట సంగ్‌ సెక్రటరీ రాజశేఖర్‌, రన్నింగ్‌ బ్రాంచ్‌ సెక్రటరీ పి.జీవన్‌ కుమార్‌, గోవిందు రాజులు సహకారంతో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఫిబ్రవరి 29వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు బిట్రగుంట రైల్వే హాస్పిటల్‌ వెనక ఉన్న క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్‌ మాట్లాడుతూ బిట్రగుంటను ఒకప్పుడు మినీ ఇంగ్లండ్‌గా పిలిచేవారని, బిట్రగుంటలో ఫుట్‌బాల్‌, క్రికెట్‌ క్రీడలను ఎక్కువగా జరిపే వారని, బిట్రగుంట లోన్‌ క్రీడల కోట కిందనే స్టేట్‌ గవర్నమెంట్‌, సెంట్రల్‌ గవర్నమెంట్‌ను ఉద్యోగాలు చేస్తున్నారని బిట్రగుంట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రన్నింగ్‌ బ్రాంచ్‌ సెక్రటరీ జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌ స్థాయిలో రైల్వే ఉద్యోగుల కోసం క్రికెట్‌ టోర్నమెంటును చెరిపామని, క్రికెట్‌ టోర్నమెంట్లో 40 టీములు పాల్గొనగా వారిలో విన్నర్స్‌ బిట్రగుంట రైల్వే లోకో టీం గెలుపొందిందని, రన్నర్స్‌ రాయంపాడు రైల్వే వర్క్‌షాప్‌ టీం గెలుపొందని తెలిపారు. గెలుపొందిన విజేతలకు పసుపులేటి సుధాకర్‌, ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌ చీఫ్‌ డాక్టర్‌ శివకుమార్‌ చేతుల మీదుగా బహుమతులను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు రైల్వే డాక్టర్‌ రమణ, సాంగ్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ సెక్రటరీ జి శ్రీనివాసులు, లోకో రైల్వే ఇన్‌స్పెక్టర్‌ బాబురావు, సత్యనారాయణ, శేఖర్‌ బాబు, శ్రీను, విజయవాడ డివిజన్‌ అన్ని శాఖల రైల్వే ఎంప్లాయిస్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️