యువత ఓటుతోనే దేశ భవిష్యత్తు :జెసి

ప్రజాశక్తి-కలికిరి యువత ఓటుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. కలికిరి జెఎన్‌టియులో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడ మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, జెఎన్‌టియు ఆధ్వర్యంలో నైబర్‌హుడ్‌ యూత్‌ పార్లమెంట్‌ కార్య క్రమం జెఎన్‌టియు కాలేజీ ఆడిటోరియంలో శనివారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంబించారు. అనంతరం అయన మాట్లడుతూ యువత ఓటు హక్కును ఒక్క పండగగా జరుపుకొవాలని, ఎవరికి ప్రలోభ పడకుండా ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవ త్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును విని యోగించు కోవా లని, యువత ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవాటు చేసు కోవ డానికి నైబర్‌ హుడ్‌ యూత్‌ పార్ల మెంటు వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని స్వీప్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. జిల్లాలోని యువత ప్రతిభను గుర్తించి వారిలోని నాయకత్వ లక్షణాలను పెం పొందించడానికే యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. యువత ఓటును ఒక్క హక్కుగా కాకుండా ఒక్క భాద్యతగా తీసు కోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. యువతకు ఓటు ఒక ఆయుధమని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అపర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలికిరి తహశీల్దార్‌, జెఎన్‌టియు సిబ్బంది, రెవెన్యూ అధికారులు, నెహ్రూ యువ కేంద్రంవాలంటీర్లు పాల్గొన్నారు.

➡️