యువత లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలి

ప్రజాశక్తి – రాయచోటి యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చునని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్‌ మేళాకు ఎంపీ మిదున్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌ బాషా, క్విస్‌ కంపెనీ రీజినల్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరు ద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగ యువత చిన్న ఉద్యోగమైనా నిరాశ చెందకుండా ఉద్యోగంలో చేరి అంచలంచెలుగా ముందుకు ఎదగాలన్నారు. రాయచోటి పట్టణంలో జాబ్‌ మేళా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కషి మరువలేనిదని ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు రవాణా, ఉచిత భోజన వసతులు ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌ మేళా సద్విని చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని ప్రతి డివిజన్‌లో జాబ్‌ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక వ్యక్తి ఉద్యోగం పొందాలంటే ఎక్కడికో వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలని, జాబ్‌ మేళాలలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తక్కువ జీతమని నిరుత్సాహం చెందకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరాలన్నారు. తర్వాత స్కిల్స్‌ని బట్టి జీతం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ విశేష కషి చేస్తుందన్నారు. యువత తమ కాళ్లపై నిలబడేందుకు ఉద్యోగంలో చేరి ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. జడ్‌పి చైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత సంక్షేమం కోసం ప్రభుత్వం జాబ్‌మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో నిరుపేదలందరికీ మెరుగైన విద్య అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివద్ధి సంస్థ జిల్లా అధికారి హరికష్ణ, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.

➡️