రహదారి భద్రత పై అవగాహన

Feb 8,2024 21:42

ప్రజాశక్తి – నెల్లిమర్ల: స్థానిక సికెఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం రహదారి భద్రత పై విద్యార్థులకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి ఆర్‌. గోవిందరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రజలంతా రహదారి భద్రత పాటించాలని సూచించారు. విద్యార్థులు వేగ నియంత్రణతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాల నివారణ జరుగుతుందన్నారు. వాహనాలు నడిపినప్పుడు హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎం. సత్య నారాయణ, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. రవిశంకర్‌ ప్రసాద్‌, రహదారి భద్రత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎం.అప్పారావు, కమిటీ సభ్యులు డి.శ్రీరామూర్తి, రిటైర్డు ఎఎస్‌ఐ ఆర్లె కృష్ణ, ఎంఇఒ విజరు కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలు ఎస్‌.రమణ, ఎల్‌. సంధ్య, విద్యార్దులు పాల్గొన్నారు.

➡️