రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశాం

Apr 2,2024 22:05

ప్రజాశక్తి-బొబ్బిలి :  వైసిపి పాలనలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామని ఆపార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ వైవి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సూర్య రెసిడెన్సీ పక్కన వైసిపి నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివద్ధి, ప్రజా సంక్షేమానికి పని చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి హయాంలో ప్రాజెక్టులు, సాగునీటి కాలువల పనులు చేపట్టామన్నారు. ఎంపి బెల్లాన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి విజయానికి పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరిగితే బొబ్బిలిలో ఒక జమీందారికి, బిసిలకు మధ్య యుద్ధం జరుగు తుందన్నారు. బొబ్బిలి నియోజj వర్గాన్ని అభివద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిన బేబినాయన ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. 15ఏళ్లు ఎమ్మెల్యేగా, రెండున్నరేళ్లు మంత్రిగా పని చేసిన రాజులు అభివద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్‌ మామిడి శ్రీకాంత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకష్ణ, పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకులు తూముల భాస్కరరావు, ఎఎంసి చైర్మన్‌ బి.శ్రీనివాసరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, ఎంపిపిలు శంబంగి లక్ష్మి, చొక్కాపు లక్ష్మణరావు, భోగి గౌరి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తూముల అచ్యుతవల్లి, జెడ్‌పిటిసి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️