‘రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలి’

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ 

పల్నాడు జిల్లా: జిల్లా ప్రభుత్వ రంగ సంస్థల ప్రాం గణాల్లోన్ని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారు లను ఆదేశించారు. మంగళవారం విజయ వాడలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల ఎన్ని కల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీ క్షించారు. ఈ సమీక్షలో నరసరావుపేట లోని కలెక్టర్‌ కార్యాల యంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినప్పటి నుండి జిల్లా లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరిచినట్లు చెప్పారు.

విధుల నుండి వాలంటీర్‌ తొలగింపు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమలులో భాగం గా పలు దినపత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గురజాల నియోజక వర్గంలో వాలంటీర్లు ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించిన ఘటనపై విచారణ అనం తరం వాలంటీర్‌ ఆవుల గోపాలకృష్ణను విధుల నుండి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన గురజాల నియోజకవర్గం తురకపాలెం గ్రామ సచివాలయ పంచాయతి కార్యదర్శి కె. రామరాజుకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. అలాగే కారెంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ రెవిన్యూ అధికారి పోలింగ్‌ కేంద్రం సంఖ్య: 253 బూతు స్థాయి అధికారిగా పనిచేస్తున్న వి.కోటేశ్వరరావు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వీడి యో లింక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపడంతో వారికి షో కాజ్‌ నోటీస్‌ జారీ చేశారు.

ఫిర్యాదు చేసిన గంటలో పరిష్కరిస్తాం

వినుకొండ: ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అతి క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వినుకొండ నియోజక వర్గం ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్వో సమావేశం నిర్వహించారు. సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలో ఉల్లం ఘించిన , అధికార వినియోగం చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08646 272000కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన గంటలో వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ప్రభుత్వం నిర్ణయించిన సమయం పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమా వేశంలో వినుకొండ మున్సిపల్‌ కమిషనర్‌ క్రిష్ణవేణి, వినుకొండ పట్టణ సిఐ సాంబ శివరావు, తహశీల్దార్‌ బ్రహ్మయ్య, పాల్గొన్నారు.

➡️