రాజధానిలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

ఇసుక రీచ్‌లను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ కల్యాణి, వీఆర్వో 

తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతుంటే నిద్రావస్థలో ఉన్న అది óకార యంత్రాంగం ఎట్టకేలకు బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామస్తుల ఫిర్యాదుతో చర్యలకు ఉపక్రమించింది. చాలా కాలంగా బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఉద్దండ రాయుని పాలెం,లింగాయపాలెం నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.ఈ వ్యవ హారంపై బోరుపాలెం,అబ్బరాజుపాలెం గ్రామస్తులు తహశీల్డార్‌ కల్యాణికి ఫిర్యాదు చేయడంతో ఆమె బుధవారం విఆర్వోలతో కలిసి ఇసుక రీచ్‌ లను పరిశీలించారు. మైనింగ్‌,ఇరిగేషన్‌,పోలీసులకు సమాచారం అందించారు. ఇసుక తరలి పోకుండా చూడాలని వీఆర్వో, విఆర్‌ఎ లను ఆదే శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని,బోరుపాలెం, అబ్బరాజు పాలెం గ్రామస్తులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇసుక తరలింపుకు అనుమతులు కోరుతూ సికెసి అనే ప్రాజెక్టు ప్రతినిధులు మైనింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా రని,ఈ విషయమై మైనింగ్‌ శాఖ పలు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు.ఇసుక తరలింపుకు అనుమతులు అనే అంశం పై జాయింట్‌ కమిటీ పరిశీలించి తగు చర్యలు తీసుకుం టుందని చెప్పారు. మైనింగ్‌ అధికారులు రానందున మరోసారి ఇసుక రీచ్‌ లను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. జెపి కంపెనీ పేరుతో ఇసుక అక్రమ తరలింపు గురించి అడుగగా, జెపి కంపెనీకి అనుమతులు రద్దు అయినట్లుగా ఉందని, పరిశీలించి చెబుతానని మైనింగ్‌ డిడి చెప్పారని ఆమె అన్నారు. జేపీ కంపెనీ బిల్లు లతో కొన్ని రోజులు లారీల ద్వారా ఇసుక తరలించారని తమ దృష్టికి కూడా వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంతం చాలా సున్నితమైందని, బోరుపాలెం, అబ్బురాజు పాలెం,రాయపూడి, ఉద్దండరాయుని పాలెంలో ఇసుక అక్రమంగా తరలిస్తు న్నారని ఫిర్యాదులు రావడంతో ఎక్కడెక్కడ ఇసుక చోరీ జరుగుతుందో మైనింగ్‌, పోలీసులకు కూడా ఫోన్‌ ద్వారా సమా చారం అందించామన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లా మైనింగ్‌ డీడీ దృష్టికి తీసుకెళ్లగా ఇసుక తరలింపుకు సంబందించి ఎవరికీ అనుమతులు లేవని చెప్పారని ఆమె అన్నారు. జేపీ కంపెనీ పాత బిల్లులపై ఇసుక ఎలా తరలించారు అనే విషయం పై విచారణ జరుపుతామని చెప్పారు. వంద లాది వాహనాలలో ఇసుక అక్రమంగా తరలి స్తుంటే పోలీసులు మొక్కుబడిగా ఒకటో రెండో ట్రాక్టర్లను పట్టుకుంటు న్నారని అనగా ఈ విషయమై సిఐ ఆనందరావుతో మాట్లాడటం జరిగిందని,ఇసుక తరలించే వారిపై వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు.

➡️