రూ.23 కోట్లతో గ్రంథాలయాల ఆధునికీకరణ

– చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణిప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో రూ.23 కోట్లతో గ్రంథాలయాలను ఆధునికీ కరించనున్నట్లు చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి అన్నారు. బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2024 -25 సంవత్సరాని సంబంధించి గ్రంథాలయాల అభివద్ధి కొరకు సుమారు రూ.23 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆమో దించారు. కొత్త పుస్తకాల కొనుగోలుకు రూ.1.50 కోట్లు, కంప్యూటర్స్‌, జిరాక్స్‌ మిషన్‌,ఫర్నిచర్స్‌ కొనుగోలుకు రూ.40 లక్షలు, నూతన భవన నిర్మాణాల కొరకు రూ.3 కోట్లు, గ్రంథాలయాల ఆధునికీకరణ కొరకు రూ.5 కోట్లు, రూ.60 లక్షలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు, పొరుగు సేవల సిబ్బంది వేతనాలు రూ.13.63 కోట్లు ఆమోదించారు. 5 సంవ త్సరాల కంటే ఎక్కువగా 2023-2024 సంవత్సరం జనవరి వరకు వివిధ మున్సిపాలిటీలు, పంచాయతీల గ్రంథాలయ సెస్స్‌ ద్వార సుమా రు రూ.3.57 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేశాయి. ఇంకూ వసూలు కావలసిన గ్రంథాలయ సెస్స్‌ బకాయి మొత్తం సుమారుగా రూ.9 కోట్లు వివిధ మున్సిపాలిటీలు, పంచాయతీలు జిల్లా గ్రంథాలయ సంస్థల నిధులకు జమచేయవలసి ఉన్నది. ఈ సెస్స్‌ బకాయిల వసూలు కొరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశానికి డిఇఒ కార్యాలయ సూపరింటెండెంట్‌ బాదుల్లా, వయోజన విద్యా ఉప సంచలకులు వెంకట సుబ్బారెడ్డి, డిఎల్‌పిఒ మస్తాన్‌వల్లి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సయ్యద్‌ అమీరుద్దిన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజ్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస చార్‌, ఉప గ్రంథాలయ అధికారి పవన్‌ కుమార్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️