రెండో విడత జెఎఎస్‌ వైద్య శిబిరాలు

Jan 2,2024 23:19
జిల్లాలో రెండో విడత

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

జిల్లాలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం తోర్రేడు సచివాలయం -1లో జెఎఎస్‌ శిబిరాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుం దన్నారు. ఇప్పటికే 1వ విడతగా జిల్లాలో 441 జెఎఎస్‌ శిబిరాలను నిర్వహించి ప్రజలకు వైద్య సేవ లను అందించినట్లు తెలిపారు. 2వ విడతగా గతంలో వివిధ రకాల రోగులను గుర్తించిన వారికి అనుసం ధాన వైద్య సేవలు లక్ష్యంగా చేపడు తున్నట్లు చెప్పారు. ప్రతి ఆరునెలలు ఒకసారి ఆయా గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో జెఎఎస్‌ శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంగళ, శుక్రవారాల్లో వారంలో రెండు సార్లు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం ఒకసారి ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా నూతన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందచేయనున్నట్లు వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కింద గ్రామాల్లో మొబైల్‌ వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేసి, ఆరోగ్య భద్రత కోసం డాక్టర్లు సేవలందించ నున్నట్లు తెలిపారు. అంతకు ముందు తోర్రేడు సచివాలయం 1 వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, గతంలో డాక్టర్లు సూచించిన కేర్‌ షీట్‌, ప్రస్తుత ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.వేంకటేశ్వరరావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.ప్రియాంక, తహశీల్దార్‌ పి.చిన్నారావు, ఎంపిడిఒ తదితరులు పాల్గొన్నారు.

➡️