రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు కోరారు. ఈమేరకు మండల పరిధిలోని ముప్పలపాడు గ్రామ సచివాలయ విఆర్‌ఒ నరసయ్యకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వలసల నివారణకు ఉపాధి పని దినాలకు 200 రోజులకు పెంచాలన్నారు. గ్రామాల్లోని కరువు పరిస్థితులపై అధికారులు దష్టి సాధించి ఉన్నత అధికారుల దష్టికి తీసుకెళ్లి రైతులు, కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం విడుదల చేసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షుడు పోతురాజు మంగయ్య, రైతు సంఘం మండల నాయకులు సూర్రెడ్డి రమణారెడ్డి, దిరిశినం వెంకటేశ్వర రెడ్డి, చిన్నయ్య,రవి పాల్గొన్నారు.

➡️