రైతులకు సూచనలు

Dec 2,2023 20:43
మాట్లాడుతున్న వ్యవసాయాధికారి

మాట్లాడుతున్న వ్యవసాయాధికారి
రైతులకు సూచనలు
ప్రజాశక్తి-కలువాయి:మండలంలో పనిచేసే అందరూ విఏఏలో హెడ్‌ క్వార్టర్‌లో ఉండి రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి తెలిపారు.మండల కేంద్రమైన మండల వ్యవసాయ అధికారి వారి కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల్లో బే ఆఫ్‌ బెంగాల్‌ లో ఏర్పడినటువంటి వాయుగుండం తుపాన్‌గా మారి నెల్లూరు నుంచి బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. కావున రైతు సోదరులు నారుమళ్లు యజమాన్యంలో భాగంగా అవిగడ్డలు కొట్టుకొని నీళ్ళు నిల్వ ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా నారుమళ్లు వేయాలనుకునే రైతులు వారం రోజులైన తర్వాత నారులు పోసుకోవాలని తెలియజేశారు. డ్రమ్స్‌ లీడర్‌తో వేసే రైతులు కూడా ఐదు రోజులు ఆగి వేసుకోవాలని తెలియజేశారు. రైతులు తుపాను పోయిన తర్వాత విత్తనం విచ్చేటప్పుడు తప్పనిసరిగా సిలింద్ర విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలని తెలియజేశారు.

➡️