రైతులెవ్వరూ అధైర్య పడొద్దు : ఎమ్మెల్యే

కొండకావురులో నేలవాలిన అరటితోటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పంటలు నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు, కొండకావూరు, ఉప్పలపాడు, దొండపాడు గ్రామాల్లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, శనగ, పత్తి, మిర్చి పొలాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. బాధిత రైతులందరికీ పరిహారం దక్కేలా సిఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నష్ట అంచనాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్‌లు డి.సుధారాణి శ్రీనివాసరావు, జె.లక్ష్మీ వెంకటేశ్వరరెడ్డి, వి.నాగిరెడ్డి, ఎంపిపి ఎం.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి పి.చిట్టిబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, తహశీల్దార్‌ రమణ నాయక్‌, ఏవో వి.నరేంద్రబాబు ఉన్నారు.

➡️