రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

Jan 26,2024 21:54
ఫొటో : అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

ఫొటో : అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
– ఆత్మకూరు రైతు కిసాన్‌ మోర్ఛా
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సంయుక్త కిసాన్‌ మోర్ఛా పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా 500 ప్రజాసంఘాల నిరసనలు ట్రాక్టర్ల ర్యాలీలు, టైరు బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్‌ బస్టాండ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద సంయుక్త కిసాన్‌ మోర్ఛా వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, తెలుగు రైతు సంఘం కార్మిక సంఘాలు, అంగన్‌వాడీ సంఘం, ఆవాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్ఛా కన్వీనర్‌ న్యాయవాది శేషారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయిందన్నారు. ఈ 75 సంవత్సరాల ఈ రాజ్యాంగ పరిపాలనలో ఈ రోజున మళ్లీ తిరిగి మనం రైతు సమస్యలపై ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉరివేసుకునే చట్టం తీసుకువచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా సంవత్సరం రోజులపాటు అనేక మంది రైతులు వెనక్కి మళ్లించే ఏర్పాటు చేశారు. ఆరోజు ప్రజా ఒత్తిడికి ప్రజా ఉద్యమానికి లొంగి మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఆ తర్వాత ఆ చట్టంలో వారు ఇచ్చిన హామీలు ఒకటి తాము మద్దతు ధర ప్రకటిస్తామని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ఆధారంగా మద్దతు ధర ప్రకటిస్తామని తెలిపారు. ఏదైతే వ్యవసాయానికి ఒక ఎకరాకి ఎంత ఖర్చవుతుందో ఆ ఖర్చుకు దాంట్లో 50శాతం ఎక్కేసి గిట్టుబాటు ధర నిర్ణయించాలని సోమనాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిందన్నారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మద్దతు ధర ప్రకటించలేదన్నారు. అమరులైన రైతాంగానికి నష్టపరిహారం చెల్లిస్తామని, ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. వెంటనే చెప్పిన హామీలను వెంటనే అమలు పరచాలని లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధమవుతారని తెలిపారు. కార్యక్రమంలో కౌలు రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, తెలుగు రైతుసంఘం నాయకులు చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్‌, కృష్ణ మోహన్‌, సిపిఎం నాయకులు డేవిడ్‌ రాజు, సిఐటియు మండల అధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, ఆవాజ్‌ రాష్ట్ర నాయకుడు పఠాన్‌ బాషా, అంగన్‌వాడీ సంఘం నాయకురాలు రమణమ్మ, ప్రజా సంఘాల నాయకులు నాగేంద్ర, కత్తి పుల్లయ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సంధాని భాషా, టిడిపి మాజీ కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

➡️