రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

 

సిహెచ్‌సిలో సమస్యలుతెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందాలని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కపిలేశ్వరపురం సిహెచ్‌సిలో మంగళవారం నిర్వహించిన ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి లో వార్డులను పరిశీలించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలపై రోగులను, వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది పలు ప్రతి పాదనలను కమిటీ దష్టికి తీసుకురాగా వాటిని ఆమోదించారు. ఆసుపత్రికి సంబంధించి పలు సమస్యలపై ఎంఎల్‌ఎ వేగుళ్ళ చర్చిం చారు. సమా వేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ చౌదరి, ఎంప ిడిఒ ఎం.రామ కృష్ణారెడ్డి, గ్రామ కార్య దర్శి కె.శివచక్రవర్తి, సర్పంచ్‌ సాకా శ్రీనివాస్‌, కాదా వెంకట రాంబాబు, కొప్పిశెట్టి వాసు, లవరెడ్డి సత్తిబాబు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .

 

 

➡️