లక్ష్యాన్ని చేరుకోవాలి

Mar 6,2024 21:11

 ప్రజాశక్తి-సీతంపేట  : ఉపాధి హామీ అమల్లో ఈ నెల 20వ తేదీలోగా ప్రగతి కనిపించాలని డ్వామా పీడీ రామచంద్ర రావు అన్నారు. బుధవారం సీతంపేట , భామిని మండలాల ఉపాధి హామీ సిబ్బంది, అదికారులతో స్థానిక వైకెపి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాన్ని చేరుకోకుంటే శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిలో భాగంగా ప్రగతిలో చివరి స్థానంలో ఉన్న ముగ్గురు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీతంపేట, భామిని ఎంపిడిఒలు కె.గీతాంజలి, శ్రీహరిరావు, ఎపిడి శ్రీహరి, ఎపిఒలు బాబూరావు, సాగర్‌, ఇసి పాండురంగ, తదితరులు పాల్గొన్నారు.

➡️