లసౌకర్యాలు కల్పించాలని వినతి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : పవిత్ర రంజాన్‌ మాసం నేపథ్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముస్లిం పెద్దలు పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సుదర్శన్‌కు మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. మసీదుల వద్ద పారిశుధ్య మెరుగుదలకు చర్యలు తీసు కోవాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నమాజుకు వెళ్లే ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి కో ఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌ షాబీర్‌బాషా, సచివాలయాల మండల కన్వీనర్‌ సయ్యద్‌ జబివుల్లా, షేక్‌, వలి, మునాఫ్‌, ఖాసిం, షరిఫ్‌, టివిఎస్‌.ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

➡️