లాల్‌బహుదూర్‌శాస్త్రి వర్థంతి

Jan 12,2024 22:14
ఫొటో : లాల్‌బహుదూర్‌శాస్త్రీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ఫొటో : లాల్‌బహుదూర్‌శాస్త్రీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
లాల్‌బహుదూర్‌శాస్త్రి వర్థంతి
ప్రజాశక్తి-కావలి : డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ, లోకల్‌ లైబ్రరీల ఆధ్వర్యంలో శుక్రవారం కావలి వెంగళరావు నగర్‌ లోకల్‌ లైబ్రరీలో స్వాతంత్య్ర సమరయోధుడు, రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి వర్థంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామ్‌ సెంటర్‌ చైర్మన్‌ దొడ్ల మనోహరరెడ్డి, డైరెక్టర్‌ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి, లైబ్రేరియన్‌ ఎస్‌.సునీత, సచివాలయ ఉద్యోగులు లక్ష్మీ, రాజేశ్వరీ, వినోద్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామ్‌సెంటర్‌ చైర్మన్‌ దొడ్ల మనోహర రెడ్డి మాట్లాడుతూ ఇండియా – పాకిస్తాన్‌ యుద్ధం, ఇండియాలో ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో జై జవాన్‌! జై కిసాన్‌! అనే నినాదాన్ని ఇచ్చిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి స్పూర్తిని ఇచ్చారన్నారు. డైరెక్టర్‌ కూనం తాతిరెడ్డి మాట్లాడుతూ లాల్‌ బహదూర్‌ శాస్త్రి భారత స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర వహించారని, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారని, నీతినిజాయితీలకు మారుపేరని, ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు గానీ, ఆస్తులు గానీ లేవన్నారు. సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ లాల్‌ బహదూర్‌ శాస్త్రి త్యాగనిరతిని, నిబద్దతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదని, గొప్ప రాజనీతిజ్ఞుడని, పేదల పక్షపాతిని, భారతదేశ రాజకీయాల్లో చెరగనిముద్ర వేసిన మహాపురుషులలో ఆయన కూడా ఒకరు అని కొనియాడారు.

➡️