లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ప్రజాశక్తి- సాలూరు : మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మున్సి పాలిటీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలిం చారు. భారీ వర్ష సూచన కనిపిస్తున్న నేపథ్యం లో చెరుకుపల్లి గెడ్డ కాలువ ద్వారా పట్టణానికి నీరు చేరే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఏటా భారీ వర్షాలు పడినప్పుడు ఫిలడెల్ఫియా ఆసుపత్రి ముందున్న కాలువ పొంగిపొర్లి వరద నీరు రామాకాలనీలోకి చేరడంపై ఆయన అధికారులను అడిగి తెలుసు కున్నారు.పెదహరిజనపేట, చినహరిజనపేట, రామాకాలనీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. బాధిత ప్రజలకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచిం చారు. వారికి ఆహారం, వంట సామాగ్రి అందుబాటులో వుంచాలని సూచించారు. పట్టణంలోని కాలువల్లో పూడికలు తీయాలని, వర్షం నీరు రోడ్డు పైకి రాకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతంలో నీరు నిల్వ వుండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ టి.జయరాం, తహశీల్దార్‌ బాలమురళీకృష్ణ, ఎంపిడిఒ జి.పార్వతి, మున్సిపల్‌ ఎఇ సూరి నాయుడు వున్నారు.

➡️